— తాసిల్దార్ ఉమలత
రామారెడ్డి జనవరి 26 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ త్రివర్ణ పతాకం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మండల తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దార్ ఉమలత, ఎంపీడీవో కార్యాలయంలో నాగేశ్వర్ గుప్తా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని డాక్టర్ సురేష్, ఐకెపి కార్యాలయం వద్ద…స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో, వెటర్నరీ హాస్పిటల్ నందు, ఆయా కుల సంఘాలలు, యువజన సంఘాలు, బ్యాంకులు, ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కేబీవీపీ ఆధ్వర్యంలో, మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లలో, ప్రభుత్వ, ప్రభుత్వ కార్యాలయాలలో అదేవిధంగా నువ్వుతనంగా కొలువుతీరిన చిరు ఉత్సాహంతో ఆయా గ్రామాలలోని గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచులు, సెక్రటరీలు, పాలకవర్గ సభ్యులు ఘనంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని అంగరంగ వైభవంగా ఎగరవేయడం జరిగింది.1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఈ వేడుకలను ప్రభుత్వం లాంచనాప్యాయంగా నిర్వహిస్తుంది. కొందరు యువకులు, మేధావి వర్గం తమ ఉపన్యాసాలతో భావితరాలకు ఉపదేశం చేయడం జరిగింది.మన దేశం స్వతంత్ర దేశంగా మారిన తర్వాత, మనకంటూ ఒక సొంత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది.1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.దీనితో భారతదేశం ఒక “సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర” రాజ్యంగా అవతరించింది.బ్రిటిష్ వారి చట్టాల నుండి విముక్తి పొంది, ప్రజల కోసం ప్రజలే రాసుకున్న రాజ్యాంగం మనకు మార్గదర్శిగా మారింది. మండల కేంద్రంలోని పాఠశాల ప్రాంతాలలో గౌరవ వందనం, తో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు చిన్నారులతో ప్రదర్శించడం జరిగింది. దేశం యొక్క వైవిధ్యతను, శక్తిని చాటి చెప్పే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది.మనం ఎందుకు గర్వపడాలి?మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ దీనిని రూపొందించింది. ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కులను, స్వేచ్ఛను కల్పిస్తుంది.”జాతి గౌరవం పెంచేలా ప్రవర్తిద్దాం, రాజ్యాంగ విలువలను కకాపాడుదాం అనే విధంగా ఘనంగా జనవరి 26 వేడుకలు నిర్వహించాలి అని మేధావి వర్గం బావి పౌరులకు నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం పై వారిని ప్రేరేపించేలా ఉపన్యాసాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, కుల సంఘాల, నాయకులు, గ్రామ ప్రజలు, పాఠశాల పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.
