తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి.. ప్రత్యక్షమైన బెట్టింగ్ సైట్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవడం తీవ్ర కలకలం రేపింది. కొందరు వినియోగదారులు ఆర్డర్ కాపీలు, కేసుల వివరాల కోసం సైట్‌ను యాక్సెస్ చేయగా, అది అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ వెంటనే హైకోర్టు వెబ్‌సైట్ స్థానంలో ఓ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమవడంతో సిబ్బంది, న్యాయవాదులు షాక్‌కు గురయ్యారు.

విషయాన్ని గుర్తించిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ సిబ్బంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హ్యాకింగ్ వెనుక ఎవరున్నారు? హ్యాకర్లు సర్వర్‌లోకి ఎలా యాక్సెస్ సంపాదించారు? సర్వర్ భద్రతలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటన కారణంగా హైకోర్టు వెబ్‌సైట్ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేసుకోవడంలో, కేసుల వివరాలు తెలుసుకోవడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం టెక్నికల్ బృందాలు వెబ్‌సైట్ భద్రతను బలోపేతం చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. న్యాయవ్యవస్థకు సంబంధించిన కీలక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *