కండక్టర్ ఇంట్లో చోరి.
.!
6తులాల బంగారం, లక్ష నగదు ఆపహరణ
మిర్యాలగూడ, అక్టోబర్ 07,( ప్రజాజ్యోతి ): మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆర్టీసీ కండక్టర్ పార్వతి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి యధావిధిగా డ్యూటీకి హాజరైన పార్వతి విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దుండగులు చాకచక్యంగా తాళం తీసి బీరువాలోని ఆరు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు అపహరించుకుపోయినట్లు బాధితురాలు వెల్లడించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ సిఐ నాగభూషణరావు తెలిపారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ వాళ్లను రప్పించి ప్రాథమిక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
