నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్18(ప్రజాజ్యోతి):
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ నాగిరెడ్డిపేట్ తరపున డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలోని తహశీల్ధార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్ధార్ రాజేశ్వర్ కు,మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలోని మాల్తుమ్మెద, చినూర్, వాడి, గోలిలింగాల, నాగిరెడ్డిపేట్, బంజారా, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్,మసాన్ పల్లి,ఆత్మకూర్,జలాల్ పూర్ గ్రామాల్లో వేల ఎకరాలల్లో పంటలు నీట మునిగాయని దింతో రైతులు పండించిన పంట పూర్తిగా నేలమట్టం అయిందని,ప్రభుత్వం నష్ట పరిహారం కింద పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని,అలాగే రబీలో పండించిన సన్న వడ్లకు ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదని ఆ బోనస్ ను వెంటనే ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నాగిరెడ్డిపేట్ అధ్యక్షుడు కాంత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి విష్ణు రావు,సభ్యులు రాజిరెడ్డి,శివారెడ్డి,నారాయణ,సిద్దిరాములు,కాంతం,ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
