అక్రమంగా ఇసుక తరలింపు

Kamareddy
1 Min Read

అక్రమంగా ఇసుక తరలింపు

నిబంధనలు లేనట్టేనా..?

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్10 (ప్రజా జ్యోతి)

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగు ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులలో ఇసుక మెట్టలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాగుపక్కన ఉన్న రైతుల పంట పొలాలలో కూడా ఇసుక మెట్టలు ఉన్నాయి. అయితే ఇదే అదునుగా పర్మిట్ ఉన్నది అని అక్రమంగా రైతుల పొలాల నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పట్టించుకోని అధికార యంత్రాంగం. ఇకనైనా స్పందించి రైతుల పొలాలలో నుండి ఇసుకను అక్రమంగా తరలించకుండా చూడాలని అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు వాగుల నుండి అక్రమంగా ఇసుకను దోపిడి కాకుండా చూడాలని రైతులు ప్రజలు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *