భారీవ వర్షాల నేపథ్యంలో పర్యవేక్షిస్తున్న అధికారులు
— తాసిల్దార్ ఉమలత
— ఎంపీడీవో నాగేశ్వర్
— ఎస్సై లావణ్య
(రామారెడ్డి ఆగస్టు 27 ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కు మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ ఉమలత, స్థానిక ఎస్సై లావణ్య, పోలీస్ సిబ్బంది ఎంపీడీవో నాగేశ్వర్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికాంత్, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఆయా ప్రమాద వరద వృద్ధితి,తో పాటు లోతట్టు ప్రాంతాలు, పాక్షికంగా దెబ్బతిన్న నివాస గృహాలను, కామారెడ్డికి రహదారి మార్గం లో గంగమ్మ వాగు వద్ద ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రమాదంగా ఉన్న నివాసగృహలను వదిలి పునరావస కేంద్రాలలో ఉండాలని చూపించారు. ప్రజల శ్రేయస్సు కొరకు సురక్షితం కోసం ప్రభుత్వా నిబంధనల మేరకు అధికార యంత్రాంగం తక్షణ సహాయం కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రమాద గంటి కలవద్ద ప్రమాద సూచికలను, వీలైతే రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ క్రాంతి కుమార్, ఆయా గ్రామాల సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది. పోలీస్ సిబ్బంది, రెస్క్యూ టీం, ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
