హస్తిన గెలిస్తే బీజేపీకి పట్టపగ్గాలు ఉండవ్

V. Sai Krishna Reddy
2 Min Read

భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఫిలాసఫీ దేశమంతా ఒక్కటిగా ఉండాలని. ఒకే దేశం ఒకే కార్డు.                                                       భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఫిలాసఫీ దేశమంతా ఒక్కటిగా ఉండాలని. ఒకే దేశం ఒకే కార్డు. ఒకే ఎన్నిక ఇలా చెబుతూ పోతూ ఆఖరుకు ఒకే పార్టీ ఉండాలని కూడా అంటుందేమో అని అంతా సరదాగా చెప్పుకున్నా బీజేపీ మాత్రం దేశంలో కాంగ్రెస్ మాదిరిగా తాను కూడా ఏకచత్రాధిపత్యంగా ఏలాలన్న ఆశతో అదే ధ్యాసలో ఉండడం జరుగుతోంది.   బీజేపీ ఆకాంక్షలు కూడా కాలం కలిసి వచ్చి ఫలిస్తున్నాయి. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో ఇరవై దాకా బీజేపీ దాని మిత్రులవే ఉన్నాయి అంటేనే కమల వికాసం ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక ఢిల్లీ కోటను బద్ధలు కొట్టాలన్న కమలం కలలు ఈసారి నెరవేరుతాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీలో 2013 నుంచి పీట వేసుకుని కూర్చున్న ఆప్ ని గద్దె దించడం ఈసారి బీజేపీకి సాధ్యపడుతుందని ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ చెబుతున్నాయి. అదే కనుక జరిగితే బీజేపీ ఆశలు నూరు శాతం తీరుతాయి. బీజేపీ ఢిల్లీలో మొదటిసారి చివరి సారి గెలిచింది 1993లోనే. అది కాస్తా 1998తో అధికారం పోయింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. ఆప్ అయితే మరో మూడు సార్లు గెలిచింది. మరి దేశంలోనే బలమైన పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి తాను ఉన్న చోట అధికారం దక్కకపోవడం ఎంతో బాధగా ఉంది. అయితే ఇపుడు బీజేపీకి మంచి రోజులు వస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇదే ఎగ్జాక్ట్ పోల్స్ లోనూ జరిగితే మాత్రం బీజేపీ బూర్ల గంపలో పడినట్లే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *