నర్సాపూర్ (ప్రజాజ్యోతి) రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంవత్సరం ముగియడంతో నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ముందస్తుగానే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 49 రోజుల పాటు సుదీర్ఘ విరామాన్ని ప్రకటించింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలను అందజేశారు. మధ్యాహ్నం 12–4 గంటల మధ్య బయట తిరగవద్దని, చెరువులు నదుల వద్దకు వెళ్లకుడాదని సూచనలు జారీ చేశారు. కాగా ఒకవైపు సెలవుల సరదా ఉన్నప్పటికీ, మరోవైపు ‘ఆర్టీసీ సమ్మె’ కొనసాగుతుండటంతో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
