నేరాల నివారణకు మిల్స్ కాలనీ పోలీసుల ఫుట్ ప్యాట్రోలింగ్ – స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు..

Warangal Bureau
1 Min Read

నేరాల నివారణకు మిల్స్ కాలనీ పోలీసుల ఫుట్ ప్యాట్రోలింగ్

– స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు

వరంగల్ సిటీ, ఏప్రిల్ 17(ప్రజాజ్యోతి)::

నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు మిల్స్ కాలనీ పోలీసులు విస్తృతంగా ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) మిల్స్ కాలనీ ఎస్ హెచ్ ఓ బొల్లం రమేష్, ఎస్‌ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో సిబ్బంది మరియు క్విక్ రెస్పాన్స్ టీమ్ కలిసి సాకరాశికుంట, కీర్తి బార్ పరిసరాలు, కరీమాబాద్, ఉర్సు దర్గా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను పరిశీలిస్తూ, అట్టి ప్రాంత ప్రజలతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి ప్యాట్రోలింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *