గొర్రెలను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

— ఏడు గొర్రెలు మృత్యువాత
రామారెడ్డి ఫిబ్రవరి 16 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రం రామారెడ్డి- రెడ్డిపేట్ వెళ్లే మార్గంలో కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టీఎస్ 17 టి 5942 గల బస్సు అన్నారం నుండి కామారెడ్డి కి వస్తుండగా రామారెడ్డి శివారులోని కట్టే డీప్ కు సమీపంలో రోడ్డు పక్కన చెట్ల కింద ఉన్న గొర్రెల పై దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు ఈ ఘటనలో 7 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా నాలుగు గొర్రెల కు తాత్కాలికంగా ప్రమాదం జరిగింది.ఈ ప్రమాద ఘటనలో మొత్తం 11 గొర్రెలకు ప్రమాదం జరిగిందని బాధితుడు ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన డోకి లచ్చయ్య కు చెందిన 11 గొర్రెలు, నష్టం అంచనా సుమారు లక్ష 50 వేల నష్టం జరిగిందని తెలపడం జరిగింది.ఈ యొక్క ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది, ఇరు గ్రామాల సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు ఘటన స్థలం వద్ద ఉన్నారు.
