మిత్రుడి మరణంతో దిగ్భ్రాంతి… కుటుంబానికి అండగా నిలిచిన చిన్న నాటి స్నేహితులు.. 

Warangal Bureau
1 Min Read
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:8; brp_del_th:0.0062,0.0001; brp_del_sen:0.1300,0.1300; motionR: 0; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 187.04501;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 43;

మిత్రుడి మరణంతో దిగ్భ్రాంతి… కుటుంబానికి అండగా నిలిచిన చిన్న నాటి స్నేహితులు..

ఆత్మకూరు, ఏప్రిల్ 17 (ప్రజాజ్యోతి):

మిత్రుడి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి లోనైన స్నేహితులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 1995-96 విద్యా సంవత్సరానికి చెందిన మిత్రబృందంలో విషాదం చోటుచేసుకుంది. అదే బ్యాచ్‌కు చెందిన బయ్య పైడి అనుకోకుండా మరణించడంతో తోటి స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలు, కలిసి గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ మిత్రులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో, “మన మిత్రుడి కుటుంబం కష్టాల్లో ఒంటరిగా ఉండకూడదు” అనే సంకల్పంతో అందరూ ఒక్కటయ్యారు. ఆత్మీయతతో, బాధ్యతతో ముందుకొచ్చిన మిత్రబృందం రూ.40,000/-లను సమీకరించి భయ్య పైడి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సహాయం ద్వారా కుటుంబానికి కొంతమేరకు ఉపశమనం కలిగించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. “పాఠశాల రోజులలో ఏర్పడిన స్నేహం జీవితాంతం నిలుస్తుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవడం మన కర్తవ్యంగా భావించాము” అని తెలిపారు. స్థానికులు, గ్రామ పెద్దలు కూడా మిత్రబృందం చేసిన ఈ సహాయాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి సంఘటనలు సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భయ్య పైడి మరణంతో వారి కుటుంబానికి తీరని లోటు ఏర్పడగా, మిత్రుల ఈ సహాయం వారికి కొంతమేర ధైర్యం ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *