నెక్కొండ మార్కెట్‌కు 23 వరకు మక్కలు తీసుకురావద్దు: చైర్మన్ హరీష్ రెడ్డి విజ్ఞప్తి

Warangal Bureau
1 Min Read

నెక్కొండ మార్కెట్‌కు 23 వరకు మక్కలు తీసుకురావద్దు: చైర్మన్ హరీష్ రెడ్డి విజ్ఞప్తి

నెక్కొండ, ఏప్రిల్ 17 (ప్రజా జ్యోతి):

నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు ఆరబోసేందుకు ప్రస్తుతం స్థలం కొరత ఉన్నందున, రైతులు ఈ నెల 23 వరకు తమ పంటను మార్కెట్‌కు తీసుకురావద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి, అక్కడ ఉన్న నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యార్డులో ధాన్యం నిల్వలు పూర్తిగా నిండిపోయాయని, ఈ స్థితిలో రైతులు పంటను తీసుకొస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ నెల 23 వరకు మక్కల రాకను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *