- సర్పంచ్ కోర్పోల్ సుమతి శివకుమార్
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) సర్పంచ్ అంటే కేవలం అధికారం మాత్రమే కాదు.. ఊరి జనం బాగు కోరే ఒక బిడ్డ అని నాగులపల్లి ‘సర్పంచ్ కోర్పోల్ సుమతి’ శివకుమార్ నిరూపించారు. గురువారం తన పుట్టినరోజు వేడుకలను అంగులు ఆర్భాటాలతో కాకుండా, అన్నదాతల ఆయుష్షు కోరుతూ సామాజిక సేవకు అంకితం చేశారు. 50 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు తన సొంత ఖర్చులతో 2 లక్షల ఉచిత బీమా చేయించి రక్షణ కవచంలా నిలిచారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపిన సర్పంచ్ దంపతుల చొరవ అభినందనీయమని గ్రామ పెద్దలు ఇంద్రసేనారెడ్డి, రామిరెడ్డి, కోర్పోల్ నర్సింలు అన్నారు. కార్యక్రమంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ.. “పుట్టినరోజున సర్పంచ్ ఇచ్చిన ఈ కానుక మా కుటుంబాలకు కొండంత ధీమా” అని కొనియాడారు.
