హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన అబ్బాయి సతీష్ చంద్ర తో అమెరికా అమ్మాయికి వివాహం జరిగింది. ఆదివారం హనుమకొండలోని ఏఆర్ఆర్ గార్డెన్స్ లో తాటిపర్తి దేవేందర్ రావు గారి కనిష్ట సోదరుడైన రఘునాధ రావు ఏకైక పుత్రుడు సతీష్ చంద్రతో అమెరికా అమ్మాయి జెస్సిక తో వివాహం జరిగింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వధూవరులను ఆశీర్వదించారు.