నేటి నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.
13న మంగళవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం. స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకరణ, 14న బుధవారం బోగి పండుగ, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,15న గురువారం మరక సంక్రాంతి పండుగ ప్రత్యేక పూజలు రాత్రి ప్రబల బండ్లు తిరుగుట, 16న శుక్రవారం కనుమ, 17న శనివారం మహాసంప్రోక్షణ సమారాదన, 23న శుక్రవారం భ్రమరాంభిక వసంతసంచమి, యోదశ వార్షికోత్సవము.
ఫిబ్రవరి 01న ఆదివారం ఎల్లమ్మ దేవత పండుగ కార్యక్రమాలు ఉత్సవాల్లో జరుగనున్నాయి.
జాతరలో భక్తుల ఇబ్బందులు
ప్రతి ఏటా జాతర సమయంలో భక్తులు ఇబ్బందులు గురవుతున్నా అధికారులు 10 రోజుల ముందు సమీక్ష సమావేశాలతో సరిపెడుతూ చేతులు దులుపుకుంటున్నారు. జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల రాకను ముందుగానే అంచనా వేసి అధికారులు భక్తులకు సరిపడా మరుగుదొడ్లు, త్రాగునీరు లేకపోవడంతో సతమతం అవుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిఏటా ఇదే తంతు కొనసాగడంతో భక్తులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి మొదలై ఉగాది వరకు మూడు నెలల పాటు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం జాతరకు లక్షలాది మంది భక్తులు మల్లన్న దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేడారం జాతర ఉండడంతో భక్తుల సంఖ్య గత ఏడాది కంటే రెండింతలు పెరిగే అవకాశం ఉంది. భక్తులు కానుకల రూపంలో కోర్టులో ఆదాయం సమకూర్తున్నప్పటికీ భక్తుల సౌకర్యం ఏర్పాట్లు మాత్రం అంతంత మాత్రం గానే ఉంటున్నాయని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చేస్తున్నప్పటికీ గతేడాది క్యూలైన్లో భక్తులు రెండు మూడు గంటలు ఇబ్బంది పడ్డారు. భక్తులకు సరిపడా త్రాగునీరు లేకపోవడం ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యలోపంతో జాతరలు ప్రతి ఏటా అధికారుల పనితీరు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
పగడ్బందీగా పోలీసుల ఏర్పాట్లు
జాతర సమయంలో పోలీస్ అధికారుల భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టారు. మల్లన్న దర్శనం కోసం వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు తో పాటు వందలాదిమంది పోలీసులతో ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు చూపుతో మెదులుతున్నారు. మల్లన్న దర్శనం కోసం మహిళలు ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో మహిళ పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలకుండా పార్కింగ్ స్థలం స్థలాలతో పాటు చెక్ పోస్ట్ లుఏర్పాటు చేస్తున్నారు.


