మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు
![]()
నల్గొండ మే 23(ప్రజాజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర రోడ్లు భవనాలు సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామ మాజీ సర్పంచ్, గౌడ సంఘం అధ్యక్షులు, చిట్యాల లైన్స్ క్లబ్ అధ్యక్షులు జనగాం రవీందర్ గౌడ్ హైదరాబాద్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తాళ్ల వెల్లంల తాజా మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మయ్య తో కలిసి ఆయన మంత్రిని గజమాలతో సత్కరించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామానాగుళ్ల శివ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.