పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 15(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పని చేస్తున్న కానిస్టేబుల్ కృష్ణయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా కానిస్టేబుల్ క్రిష్ణయ్య కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును జిల్లాఎస్పీ నరసింహ జిల్లా పోలీసు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది.కృష్ణయ్య కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు,పోలీసు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ లు రవీందర్ రెడ్డి,జనార్ధన్ రెడ్డి,కోదాడ డి ఎస్ పి శ్రీదర్ రెడ్డి,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజు భార్గవి,పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,వెల్ఫేర్ ఆర్.ఎస్.ఐ సాయిరాం,కుటుంబ సభ్యులు కిరణ్,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *