ముస్లిం స్మశాన వాటికకు రూ.5 లక్షల నిధులు మంజూరు చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్‌.

Vikarabad Staff Reporter
1 Min Read

ముస్లిం స్మశాన వాటికకు రూ.5 లక్షల నిధులు మంజూరు చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్‌

రజిత వెంకటేష్ కు సన్మానించిన మసీదు కమిటీ సభ్యులు


  • పరిగి, అక్టోబర్ 08 (ప్రజాజ్యోతి): పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాయికొటి వాడ లోని ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం కోసం మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు.
    ఈ సందర్భంగా స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు పరిగి మసీదు కమిటీ సదర్ అబ్దుల్ మోయిజ్, నాయబ్ సదర్ సమీ పటేల్, కమిటీ ముహ్తమద్ రషీక్ తోపాటు 13వ వార్డు కౌన్సిలర్ మీర్ తాహేర్ అలీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.
    అనంతరం వారు మాట్లాడుతూ, తమ వినతిని సానుకూలంగా పరిశీలించి ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో స్మశాన వాటిక అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అన్నారు.
    ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రియాజ్, కాలనీవాసులు, మసీదు కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *