గరిడేపల్లి, జూన్ 29 (ప్రజాజ్యోతి):గరిడేపల్లి మండల కేంద్రంలోని టీజీఎంఎస్ బాలికల వసతి గృహంలో ఖాళీగా ఉన్న రాత్రి కాపలాదారు (నైట్ వాచ్ ఉమెన్) పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హాస్టల్ కేర్‌టేకర్ కమ్ వార్డెన్ పార్వతి తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు టీజీఎంఎస్ బాలికల వసతి గృహ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత ధ్రువపత్రం,నివాస ధ్రువపత్రం, ఆధార్ కార్డు,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు,సంబంధిత ధ్రువపత్రాల అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం హాస్టల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
