43వ వార్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు 

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24(ప్రజా జ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 43వ వార్డు నెహ్రూ నగర్ లో వార్డ్ కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ సౌజన్యంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల 38వ వార్షికోత్సవం సందర్భంగా నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.చిన్నారుల,మహిళల కోలాటాలు, నృత్యాలతో భక్తి గీతాలు పాడుతూ ప్రధాన వీధుల గుండా నిమజ్జన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.అంతకుముందు ఉట్లు కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వార్డు ప్రజలు,భక్తులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *