డీజే పర్మిషన్ కావాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

Rammoorthy Kamareddy
1 Min Read

డీజే పర్మిషన్ కావాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలోని పోసానిపేట గ్రామంలో వినాయక చవితి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో భాగంగా డీజే పర్మిషన్ కావాలని అందులోను సీఎం రేవంత్ రెడ్డి పాట కావాలని లేదంటే వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దూకుతా అని కురుమ మహేష్ అనే యువకుడు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడo జరిగింది. స్థానిక ఎస్సై టీ. మురళి ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ హరీష్ రెడ్డి, మహేష్, సంతోష్, కానిస్టేబుల్ సమాచారం తెలుసుకొని వాటర్ ట్యాంకు పైకి ఎక్కిన,కురుమ మహేష్ ను నచ్చజెప్పి కిందికి దిగమని ప్రయత్నం చేస్తూ కానిస్టేబుల్స్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి న కురుమ మహేష్ కు కౌన్సిలింగ్ ఇచ్చి కిందికి దింపారు. తదుపరి స్థానికులు ఊపిరి పీల్చుకొని హర్షం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *