చేవెళ్ల లడ్డు 28 లక్షల 11 వేలు

Rangareddy Bureau
1 Min Read

 

చేవెళ్ల ప్రజా జ్యోతి

మున్సిపల్ కేంద్రంలో రచ్చబండ వద్ద ఏర్పాటుచేసిన గణనాథుని లడ్డు వేలం పాట ఉత్సాహంగా హోరాహోరీగా సాగింది. చేవెళ్ల గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ చెన్నారెడ్డి 28 లక్షల 11 వేలకు రచ్చబండ గణనాధుని లడ్డును కైవసం చేసుకున్నారు. 11 రోజుల నిత్య పూజలు అందుకున్న గణనాధుని లడ్డు సొంతం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గత సంవత్సరం లడ్డు 16 లక్షలు పలికింది. ఈ సందర్భంగా రచ్చబండ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బండారి శ్రీనివాస్ రెడ్డిని షలుతో సన్మానించి లడ్డును అందజేశారు. గణనాధుని ఆశీస్సులు శ్రీనివాస్ రెడ్డి కుటుంబం పై ఉండాలని వారు ఆకాంక్షించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *