డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన
— ఏవో భాను శ్రీ, ఏఈఓ రాకేష్ మినుకుల

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25(ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో శుక్రవారం క్షేత్ర స్థాయిలో సర్వేయర్లు నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను ఏఈఓ రాకేష్ మినుకుల , సర్పంచ్ దొకి లచ్చయ్య , ఉప సర్పంచ్ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేయర్లకు మరియు రైతులకు పలు కీలక సూచనలు చేయడం జరిగింది.సర్వే నంబర్ల వారీగా పంట వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత కచ్చితంగా నమోదు చేయాలి. సర్వేయర్లు నమోదు చేసే ఈ వివరాలనే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి, ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్తగా సర్వే నిర్వహించాలి.
రైతులకు సూచనలు..!
డిజిటల్ క్రాప్ బుకింగ్ ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి రెవెన్యూ గ్రామానికి ఒక సర్వేయర్‌ను ప్రత్యేకంగా నియమించడం జరిగింది. రైతులు తమ గ్రామ సర్వేయర్‌కు అందుబాటులో ఉండి, తమ సర్వే నంబర్ల వారీగా సాగు చేస్తున్న పంట వివరాలను మరియు పంట రకాన్ని సరిగ్గా నమోదు చేసుకోవాలని సూచడమైనది.ఇట్టి కార్యక్రమంలో సర్వేయర్ చింతల రవీందర్, రైతులు దోమకొండ బైరయ్య,శంకర్, రాజు, శేఖర్, నరేష్ ,భూమయ్య, బాలయ్య,సంజీవ్ రైతులు పాల్గొన్నారు.
