13 ఏళ్లుగా గణేష్ విగ్రహాన్ని అందిస్తున్న దాత సంతోష్ పాటిల్, తండ్రి రామ్ పాటిల్ 

Rammoorthy Kamareddy
1 Min Read

13 ఏళ్లుగా గణేష్ విగ్రహాన్ని అందిస్తున్న దాత సంతోష్ పాటిల్, తండ్రి రామ్ పాటిల్ 

లింబూర్ సర్వజనిక్ గణేష్ మండలి కి నిరంతరంగా విగ్రహం అందజేత

డోంగ్లీ మండలం, సెప్టెంబర్ 24 (ప్రజా జ్యోతి):

కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం లింబూర్ గ్రామంలోని సర్వజనిక్ గణేష్ మండలికి గత 13 సంవత్సరాలుగా గణేష్ విగ్రహాన్ని దాతగా అందిస్తూ భక్తి, సేవాభావాన్ని చాటుకుంటున్నారు గ్రామానికి చెందిన సంతోష్ పాటిల్, తండ్రి రామ్ పాటిల్. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించే గణనాథుడి విగ్రహాన్ని తమ వంతు బాధ్యతగా అందిస్తూ వస్తున్నారు.గత 13 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా గణేష్ విగ్రహాన్ని అందించడం పట్ల గ్రామస్థులు, మండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తి భావంతో పాటు గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో సర్వజనిక్ గణేష్ ఉత్సవాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ, అనంతరం గణనాథుడి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.విగ్రహాన్ని ప్రతి ఏడాది దాతగా అందిస్తున్న సంతోష్ పాటిల్, తండ్రి రామ్ పాటిల్,కుటుంబ సభ్యులకు సర్వజనిక్ గణేష్ మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా తమ సహకారం కొనసాగించాలని కోరారు. 13 ఏళ్లుగా గణేష్ విగ్రహాన్ని అందిస్తూ వస్తున్న వారి సేవాభావం గ్రామంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *