భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత..

Warangal Bureau
2 Min Read

భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

– రూ.56 వేల విలువైన 16 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

పర్వతగిరి, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి)

పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి డంపింగ్ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పర్వతగిరి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. పర్వతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏబీ తండాలో ఉన్న మైనేని రాము లక్ష్మీ పౌల్ట్రీ ఫామ్‌లో శనివారం తనిఖీలు చేపట్టగా భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది.

టాస్క్‌ఫోర్స్ అధికారుల వివరాల ప్రకారం.. పౌల్ట్రీ ఫామ్‌లో తనిఖీలు నిర్వహించగా మొత్తం 16 క్వింటాళ్ల (1,600 కిలోల) పీడీఎస్ బియ్యం గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.56,000గా అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం వివరాలు

50 కిలోల చొప్పున 14 బ్యాగులు – 700 కిలోలు (7 క్వింటాళ్లు) – విలువ రూ.24,500

50 కిలోల చొప్పున 4 సంచుల విరిగిన బియ్యం – 200 కిలోలు (2 క్వింటాళ్లు) – విలువ రూ.7,000

క్వింటాల్ చొప్పున 7 సంచులు – 700 కిలోలు (7 క్వింటాళ్లు) – విలువ రూ.24,500

మొత్తం: 1,600 కిలోలు (16 క్వింటాళ్లు) – విలువ రూ.56,000. ఈ సందర్భంగా పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా డంపింగ్ చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మైనేని రాము, వయస్సు 43 సంవత్సరాలు, తండ్రి సుబ్బారావు, వృత్తి వ్యాపారం, ఏబీ తండా, పర్వతగిరిగా పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం స్వాధీనం చేసుకున్న మొత్తం బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పర్వతగిరి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ, డంపింగ్‌పై నిరంతరం నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎ. మధుసూధన్, ఇన్‌స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్‌ఐ బి. ఉప్పలయ్యతో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పర్వతగిరి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *