ఆర్యవైశ్యుల ఉన్నతికి కర్నాటి కిషన్ సేవలు మరువలేనివి సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తెలిపారు. ఆదివారం బిజెపి సీనియర్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు కర్నాటి కిషన్ 75వ జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాపిక ను అందజేసి శాలువాతో సన్మానించి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా, బిజెపి సీనియర్ నాయకులుగా ఎన్నో సేవలందించారని కొనియాడారు. 75 ఏళ్ల వయసులోని నవ యువకుడిగా సమాజానికి, ఆర్యవైశ్య సంఘానికి ఆయన చేస్తున్న సేవలు మరువలేనివి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, శ్రీ సంతోషిమాత దేవాలయం ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశరావు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహాయ కార్యదర్శి చల్లా లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.