త్రాగునీటి బోర్ల వివాదం
— కర్రలతో దాడి ఇద్దరికీ గాయాలు
— ఇద్దరిపై కేసు నమోదు ఎస్ఐ పి. రాజశేఖర్
రామారెడ్డి మే 29 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలం
గోకుల్ తండా గ్రామపంచాయతీ చెందిన భగవత్ వినోద్ / సక్రు, ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా గోకుల్ తండా గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ భూమిలో గ్రామస్తులకు త్రాగునీటి వసతి కోసం రెండు బోర్లు వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వారి గ్రామస్తులైన మాలవత్ సవాయిరం మరియు అతని కుటుంబ సభ్యులు గ్రామపంచాయతీ కి సంబంధించిన బోరు యొక్క భూమి మరియు దానికి సంబంధించిన దారి నీ కబ్జా చేసి న విషయం పై గ్రామస్తులంతా గురువారం సమస్య పరిష్కారం కోసం సాయంత్రం వారి తాండ పరిధిలోని హోటల్ వద్ద కూర్చుని మాట్లాడుతుండగా కోపోద్రికంతో సవాయిరం, మాలవత్ కిషోర్ వారి సంబంధించిన వ్యక్తులు కర్రలతో భగవత్ రంగి, బాదావత్ నీలాను, తలల పై కట్టెతో కొట్టగా రక్తగాయల అయినాయి, మెగావత్ సంఘ్యను మలవత్ సురేష్ కర్రతో కొట్టిన విషయంపై ఫిర్యాదు రాగా సవాయిరం మరియు కిషోర్ వారికి సంబంధించిన వారి పై కేసు నమోదు చేయడం జరిగింది. అని స్థానిక ఎస్సై పి.రాజశేఖర్ తెలపడం జరిగింది.
