నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు రావడంతో మండల ఏపీఓ పుణ్యదాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మండలంలో రూ. 9.98 కోట్లతో చేపట్టిన పనులపై ఇటీవల సామాజిక తనిఖీ నిర్వహించగా పలు అవకతవకలు బయటపడ్డాయి. విచారణలో భాగంగా సిబ్బంది నుంచి రూ. 1.25 లక్షల రికవరీతో పాటు, రూ. 16 వేల జరిమానా విధించారు. కాగా, తనిఖీ నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఏపీఓ డ్రా చేసి, బృంద సభ్యులకు అందజేయకుండా కాలయాపన చేశారు. దీనిపై డీఆర్డీఓ శ్రీనివాస్‌కు ఫిర్యాదు అందడంతో, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఏపీఓను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
