సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 22(ప్రజాజ్యోతి):సొంత తయారీతో వినియోగదారుల అభిరుచి మేరకు అందమైన డిజైన్లలో జువెలరీ తయారు చేసి అందుబాటు ధరలలో అందించడమే కార్బన్ లాక్స్ జ్యువెలరీ సిద్ధాంతమని బిజినెస్ కోఆర్డినేటర్ ముస్త్యాల కిషన్, జనరల్ మేనేజర్ మిహెర్ షా, స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రం బాలాజీ గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్బన్ లాక్స్ జ్యువెలరీ రెండు రోజుల జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. అందమైన డైమండ్, గోల్డ్, సిల్వర్ జువెలరీ తో పాటు దేవుళ్ళ విగ్రహాలు ,కిరీటాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సుమారు 5వేల రకాల డిజైన్లతో అన్ని రకాల బంగారు ఆభరణాలను ఎగ్జిబిషన్ లో ఉంచామన్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు వారు మెచ్చిన డిజైన్లలో ఆభరణాలు తయారు చేసే అందించడం జరుగుతుందన్నారు. సొంత తయారీ కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించి అందిస్తున్నట్లు తెలిపారు.జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు కొనసాగే జువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
