తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం టూరిస్ట్ రైలు

V. Sai Krishna Reddy
5 Min Read

తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం టూరిస్ట్ రైలు

 

నల్గొండ ఫిబ్రవరి 27

ప్రజా జ్యోతి

తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం *రైల్వే శాఖ ప్రత్యేక “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను* అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చ్ 21వ తేదీ నుండి జూన్ 12 వ తేదీ లలో 6 ప్రత్యేక ప్యాకేజీలను ” *భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు* ” ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు I *RCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.

ప్యాకేజీ వివరాలు:

1. దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో (SCZBG53):* (తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, త్రిచి, తంజావూరు) ఈ యాత్ర మార్చ్ 21వ తేదీన ప్రారంభమై 28 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14,700/- 3 ఏసీ ధర 22,300/- 2 ఏసీ ధర 28,700/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

2. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG55):* ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్) ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశర్). ఈ యాత్ర ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమై 24 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 17,600/- 3 ఏసీ ధర 26,700/- 2 ఏసీ ధర 34,600/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్దేడ్ నాందేడ్, పూర్ణ మీదుగా వెళ్తుంది.

3. అయోధ్య-కాశీ: బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర (SCZBG56):* పూరి కోణార్క్-బైద్యనాథ్ ధామ్ – వారణాసి అయోధ్య ప్రయాగరాజ్. ఈ యాత్ర ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మే 7 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700/-3 ఏసీ ధర 26,100/- 2 ఏసీ ధర 34,100/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని,దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.

4. హరిద్వార్-మాతా వైష్ణోదేవి- రిషికేష్-యాత్ర: (SCZBG57):* మధుర-బృందావనం-మాతా వైష్ణోదేవి-హరిద్వార్- రిషికేశ్. ఈ యాత్ర మే 12వ తేదీన ప్రరంభమై మే 21వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,500/- 3 ఏసీ ధర 25,700/- 2 ఏసీ ధర 33,400/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల్ , బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్ష, వార్తా & నాగ్పూర్ మీదుగా వెళ్తుంది.

5. అరుణాచలం – చిదంబరంతో దివ్య దక్షిణ యాత్ర : (SCZBG58):* తిరువణ్ణామలై [అరుణాచలం] – రామేశ్వరం – మధురై – కన్యాకుమారి – త్రిచి – తంజావూరు – చిదంబరం. ఈ యాత్ర మే 24 వ తేదీన ప్రారంభమై మే 31 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14,500/-, 3 ఏసీ ధర 21,700/- , 2 ఏసీ ధర 27,900/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

6. బైద్యనాథ్ ధామ్‌తో అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్ర – యమునా నది పుష్కరాలు ప్రత్యేకం : (SCZBG59):* పూరి – కోణార్క్ – బైద్యనాథ్ ధామ్ – వారణాసి – అయోధ్య – ప్రయాగరాజ్. ఈ యాత్ర జూన్ 03 వ తేదీన ప్రారంభమై జూన్ 12 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,700/-, 3 ఏసీ ధర 26,100/- , 2 ఏసీ ధర 34,100/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.

సౌకర్యాలు:

రైలు, బస్సు, హెూటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్ర భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030727, 9281030734, 9281030744, 9281030759 లకు సంప్రదించాలని. మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలని తేలిపారు.

వేసవికాలం ప్రత్యేక హైదరాబాద్ నుంచి దేశీయ విమాన ప్యాకేజీలు:

1. కాశ్మీర్: 5రాత్రులు/6రోజులు (ఏప్రిల్:3,10,14,23) టికెట్టు ధర: Rs. 42,590/-

2. కాశి – అయోధ్య: 6రాత్రులు/7రోజులు (ఏప్రిల్:02) టికెట్టు ధర: Rs. 35,550/-

3. గుజరాత్: 7రాత్రులు/8రోజులు (ఏప్రిల్:03) టికెట్టు ధర: Rs. 35,600 /-

4. కర్ణాటక: 5రాత్రులు/6రోజులు (ఏప్రిల్:11) టికెట్టు ధర: Rs. 34,900 /-

5. హరిద్వార్ – రుషికేశ్: 5రాత్రులు/6రోజులు (ఏప్రిల్:18) టికెట్టు ధర: Rs. 36,000 /-

6. చార్ ధామ్: 10రాత్రులు/11రోజులు (మే:18) టికెట్టు ధర: Rs. 74,430/-

7. లడఖ్: 6రాత్రులు/7రోజులు (టూర్ డేట్: మే:10) టికెట్టు ధర: Rs. 61,880 /-

8. అండమాన్: 5రాత్రులు/6రోజులు (టూర్ డేట్: ఏప్రిల్:21) టికెట్టు ధర: Rs. 46,950 /-

 

భారత్ గౌరవ్ మరియు దేశీయ విమాన ప్యాకేజీపై LTC వర్తిస్తుంది

హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ విమాన ప్యాకేజీలు:

1. నేపాల్: 6రాత్రులు/7రోజులు (టూర్ డేట్: ఏప్రిల్:16) టికెట్టు ధర: Rs. 55,700/-

2. శ్రీలంక: 5రాత్రులు/6రోజులు (టూర్ డేట్: మే:14) టికెట్టు ధర: Rs. 62,750/-

3. యూరోప్: 13రాత్రులు/14రోజులు (టూర్ డేట్: మే:24) టికెట్టు ధర: Rs. 4,41,650/-

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *