- బీఆర్ఎస్ నిరసన
- నడికూడ మండల కేంద్రంలో చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో
నడికూడ, ఫిబ్రవరి 01,(ప్రజా జ్యోతి):
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండల కేంద్రంలో ఆదివారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో బిఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

