- సత్య మార్గం “ప్రజాజ్యోతి” ధ్యేయం..!
ప్రజా జ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పర్వతగిరి, జనవరి 16 (ప్రజాజ్యోతి)
పర్వతగిరి మండలంలోని గోపనపల్లి దూడల మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాజ్యోతి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సమాచారంలో వేగం సత్యం మార్గంలో ప్రయాణమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాజ్యోతి యాజమాన్యానికి మరియు రిపోర్టర్లకు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా ప్రజాజ్యోతి పత్రిక ఎల్లవేళల కృషి చేస్తున్నందుకు అభినందించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రజాజ్యోతి పత్రికను అందులోని వార్తలను ఎప్పటికప్పుడు ఇచ్చే అప్డేట్లను చూస్తూ ప్రజా సమస్యలపై పరిష్కార దిశగా పనిచేసే వారిమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాజ్యోతి మండల రిపోర్టర్ నాగుల రాజు, పర్వతగిరి మండల ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ముదురకోల నాగరాజు, గంటారావమ్ రిపోర్టర్ మునిగే శ్రీకాంత్, వరంగల్ వాయిస్ రిపోర్టర్ సంతోష్,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మనోజ్ గౌడ్, సోమవారం సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్, గోపెనపల్లి ఉపసర్పంచ్ రవళీమధు,సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చిన్న పెళ్లి అజయ్, నరేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

