హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆత్మకూరు గ్రామానికి చెందిన యువకుని ఫోన్ మిస్సయ్యింది. కొమ్ము ప్రేమ్ సాయి అనే యువకుడు శనివారం సాయంత్రం రూ. 38వేల విలువ గల సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేవలం 15 నిమిషాల్లో సీపీఓ కార్యాలయం సహాయంతో లోకేషన్ ఆధారంగా సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని యువకుడికి సీఐ సంతోష్, శిక్షణ ఎస్సై శ్రావణ్ కుమార్ సెల్ ఫోన్ అప్పగించారు.