యువత మత్తు పదార్థాల భారిన పడవద్దని, చేడు వ్యసనాలకు బానిస కావద్దని కేర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. వరంగల్ నగర పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు శుక్రవారం జాగృతి పోలీస్ కళా బృందం వారిచే దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పరిధిలో కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ లో యువత గంజాయి డ్రగ్స్, గుట్క మత్తు పదార్థాల బారిన పడవద్దని, గంజాయి అమ్మిన సేవించిన 8712584473 మొబైల్ నెంబరుకు సమాచార మందించాలని చెప్తు, చదువు యొక్క ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాలు, డయల్100, షీ టీమ్స్, తల్లితండ్రులు చెప్పిన విధంగా నడుచుకోవాలని, మరియు సైబర్ క్రైమ్స్ గురించి వివరంగ తెలియపరుస్తు, సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 గురించి తెలుపుతు పలు అంశాలపై పాటలు పాడుతు, కాలేజ్ పిల్లలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలేజ్ యాజమాన్యం, అధ్యాపక బృందం, కళాబృందం ఇంచార్జి నాగమణి గారు, సభ్యులు, హెచ్సి విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య, శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి,మరియు కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
యువత మత్తు పదార్థాల భారిన పడవద్దు.. * కేర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్ కుమార్

Leave a Comment