బాన్సువాడ టౌన్ ప్రజా జ్యోతి ఆగస్టు 25.
బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పెద్ద షాక్ తగలనంది కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్లు కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అతి తొందరలో బిఆర్ఎస్ తీర్ధాన్ని పూచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు దానికి ఈనెల 28న హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైంది బాన్సువాడ నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రధానంగా కోటగిరి పోతంగల్ వర్ని రుద్రూర్ చందూర్ మోస్ర బాన్సువాడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కు తరలి వెళ్ళనున్నట్లు బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుతున్నారు బిఆర్ఎస్ లో చేరనున్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు కోటగిరి ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు కోటగిరి మండల కేంద్రానికి చెందిన రవికుమార్ రుద్రూర్ సొసైటీ మాజీ చైర్మన్ ఎంపీ గంగారాం తో పాటు బాన్సువాడ ముఖ్యంగా ఏనుగుల రవీందర్ రెడ్డి వర్గానికి చెందినటువంటి ముఖ్యులు పదేళ్లపాటు బిఆర్ఎస్ లో ఉండి తదనంతరం కాంగ్రెస్ తీర్ధాన్ని పుచ్చుకున్నటువంటి బడా నేతలు వెళ్లడానికి సైతం రంగాన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఈనెల 28న ముహూర్తం పెట్టుకున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి దీని వెనకాల పెద్ద పెద్ద నేతలే ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతo ఉన్న సమయంలో రాజకీయంలో ఎవరు ఏ పక్కన ఉంటారో ఎవరికి ఊహకంద అటువంటి ఎత్తుగడలతో నాయకులు పార్టీ ల్లలో వ్యవహరిస్తున్నారు వీరి తీరు చూస్తుంటే ప్రజలు ముక్కునా వేలేసుకుంటున్నారు.
అసలు బాన్సువాడ నియోజకవర్గ రాజకీయానికి ఏమైంది
Leave a Comment
