పెద్దపులి ఆచూకీ ఉన్నట్టా లేనట్టా…?
రామారెడ్డి జూలై 17 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం నుండి ఆవుపై పెద్దపులి దాడి చేసింది. అనే వార్త మండల కేంద్రంతో పాటు పక్క మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు, పోలీసులు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా జిల్లా ఫారెస్ట్ అధికారి పత్రిక ముఖంగా పెద్దపులి తిరుగుతున్న ఆడవాళ్ళ కోసం అడవిలో డ్రోన్ కెమెరాలతో, ప్రత్యేక ఫారెస్ట్ బృందాలతో పెద్దపులి ఆచూకీని కనిపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఇదే క్రమంలో ఆవుపై పెద్ద పూరి దాడి చేసింది అనే విషయంపై నలుగురిని రిమాండ్ చేసిన విషయం విధితమే అయితే పెద్దపులి సమీప ప్రాంతంలోని అడవిలో ఉందా లేదా అనే కోణంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.