ఘనంగా పాటి వరుణ్ రెడ్డి జన్మదిన వేడుకలు
బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
నల్గొండ ఏప్రిల్ 05(ప్రజాజ్యోతి ప్రతినిధి): నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల పుర తాజా మాజీ కో ఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి-అరుణ దంపతుల కుమారుడు పాటి వరుణ్ రెడ్డి జన్మదిన వేడుకను పురస్కరించుకుని శనివారం చిట్యాల కు చెందిన రహదారి ప్రమాదంలో తీవ్ర గాయలపాలై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న రామదాసు అనే పేద కార్మికుడికి 25 కిలోల బియ్యం, రూ. వెయ్యి మాధవరెడ్డి దంపతులు అందజేశారు. అనంతరం నార్కెట్ పల్లిలోని ఆదరణ వృద్దాశ్రమంలో వృద్ధ మహిళలకు 25 కిలోల బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జనగాం రవీందర్ గౌడ్, కార్యదర్శి రేగులగడ్డ నరసింహ గౌడ్, కోశాధికారి కొల్లోజు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు వరకాంతం భాస్కర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, ఏనుగు క్రాంతిరెడ్డి, గంగాపురం భాస్కర్ గౌడ్, పొన్నం లక్ష్మయ్య గౌడ్, బాలగోని రాజు గౌడ్, పంతంగి కరుణాకర్ గౌడ్, నల్ల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.