నెక్కొండ/ప్రజాజ్యోతి:
కేసముద్రం మండలం కోమటిపల్లి తండాకు చెందిన బానోతు రమేష్ అనే వ్యక్తి గురువారం కుటుంబ సమస్యలతో వారి కుటుంబంతో గొడవపడి కేసముద్రం నుండి నెక్కొండ కు వచ్చి ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోబోతుండగా చుట్టుపక్కల చూసిన వాళ్లు డయల్ హండ్రెడ్ కు కాల్ చేయగానే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సాంబయ్య, హోంగార్డ్ వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు అనంతరం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అతని పూర్తి వివరాలు తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి అతని తల్లి అయిన బానోత్ కమలమ్మ తండ్రి బానోతు భీమా భార్యా సునీత కుటుంబ సభ్యులకు అతనిని అప్పగించారు వెంటనే స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ సాంబయ్యను హోంగార్డ్ ను ఎస్సై తో పాటు పలువురు అభినందించారు.