షేర్ ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహల నిర్ములనపైన అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఎల్లాపూర్ ఏరియా లో గల ఎమ్జేపి (బాలికల ) వర్దన్నపేట స్కూల్ నందు బాల్య వివాహ నిర్ముర్మూలనపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి షేర్ ఎన్జీవో కోఆర్డినేటర్ టి శిరీష మాట్లాడుతూ.. మైనర్లకు వివాహం చేసినట్లయితే రూ. 1లక్ష జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష విధించబడుతుంది అన్నారు. బాలికలు సోషల్ మీడియా పరంగా చాలా జాగ్రత్త గా ఉండాలని అన్నారు. ఏహెచ్టియు సిఐ వెంకన్న మాట్లాడుతూ.. పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, మత్తుకు బానిసకావద్దని, ట్రాఫికింగ్ కి గురి కావద్దు అన్నారు. పిల్లల పైన జరిగే అగాయిత్యాలు అనేవి 90% తెలిసిన వారి ద్వారా నే జరుగుతుంది అన్నారు. అలాగే చైల్డ్ లైన్ -1098 సూపర్ వైజర్ ర్రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. హక్కులు అనేవి పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఉంటాయని, ఆ హక్కులకు భంగం కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1098 సమాచారం అందించాలని, ఇది 24/7 పని చేస్తుంది అని అన్నారు. యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏఎస్సై భాగ్యలక్ష్మి బాల్య వివాహలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాం కావాలని స్టూడెంట్స్ కి సూచించారు. పిల్లలపైన జరిగే అగాయిత్యాల గురించి వివరించిన డిపార్ట్మెంట్ వారికి స్కూల్ ప్రిన్సిపాల్ సరిత కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో షేర్ ఎన్జీఓ ప్రతినిధులు గాయత్రి, జగన్, ఏహెచ్టియు రామారావు, పాషా , ఎమ్జేపి స్కూల్ ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
షేర్ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘బాల్య వివాహల నిర్మూలన’ పై అవగాహనా

Leave a Comment