సంగెం, మార్చి27 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.గవిచర్ల గ్రామానికి చెందిన గాలి చందు(17)ద్విచక్ర వాహనం పై ఆశాలపెళ్లి వైపు వెళ్తున్న క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు