దామెర/ప్రజాజ్యోతి:
భూ భారతి నూతన చట్టం దేశానికే ఆదర్శంగా నిలువ బోతుందని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్ లో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మిదేవి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడుతూ.. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే భూభారతి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. రైతుకు అండగా ఉండేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. భూ భారతి చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లేందుకు ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూ భారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు రైతుల నుండి వారి భూమి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అట్టి భూ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో తహసీల్దార్ వివరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డివో నారాయణ, మండల ప్రత్యేక అధికారి రాపెల్లి బాలరాజు, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఏడీఏ వి.రవీందర్, కాంగ్రెస్ నాయకులు మన్నెం ప్రకాష్ రెడ్డి, గుడిపాటి శ్రీధర్ రెడ్డి, బీరం సుధాకర్ రెడ్డి పోలేపాక శ్రీనివాస్ సదిరం పోచయ్య, వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు, తదితరులు పాల్గొన్నారు