తప్పు చేస్తే శిక్ష తప్పదుః సీఎం రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
2 Min Read

బెట్టింగ్ వ్యవహారాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్‌, ఆన్‌లైన్‌ యాప్స్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను వేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కోసం కలిసి వస్తే అన్ని పార్టీల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తామన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సీఎం, పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనాలకు తెలంగాణలో తావులేదు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు సీఎం రేవంత్. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020 లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు. బాధితులపై సానుభూతితో ఉండి, నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదన్న సీఎం, అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో వారు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుందని సీఎం ప్రశ్నించారు. 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి.. సూచనలు ఇవ్వండి. మీరు హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావని, మళ్లీ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేది 2028లోనే అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌లో అంతర్గత పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోందన్నారు. ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. మొన్న పద్మారావు గారు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు… వెంటనే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మేం మంచిని మంచి అంటాం.. చెడును చెడు అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవని వెల్లడించారు. మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరు.. మేం వివక్ష చూపం.. వివక్ష మా విధానం కాదని ముఖ్యమంత్రి అన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *