ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. టన్నెల్ ప్రమాదంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది టన్నెల్‌లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పదమూడు గంటలుగా వారు టన్నెల్‌లోనే ఉండిపోయారు. ప్రమాద ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉన్నట్లు గుర్తించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితిపై వారు సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.