వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘ఆఫీసర్’

V. Sai Krishna Reddy
1 Min Read

మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన కుంచాకో బోబన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’కి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. ఇప్పటి వరకు 25 కోట్లు కలెక్షన్లు వసూలు చేసి ఈ ఏడాది అతిపెద్ద గ్రాసర్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది.

ఈ సినిమాను కేవలం రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. రోజురోజుకూ ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు జీతూ అస్రఫ్ తెరకెక్కించారు. ప్రియమణి ఇందులో కీలక పాత్ర పోషించారు. ఏడాది నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కుంచాకో బోబన్ ఈ చిత్రంతో మళ్ళీ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తోంది.

పద్మిణీ’ తర్వాత కుంచాకో బోబన్‌కు సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. వచ్చే నెల వరకు ఈ సినిమాకు పోటీగా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *