దామెర, ఫిబ్రవరి 20 (ప్రజాజ్యోతి):
లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుకు కృషి చేయాలని డా.మంజుల జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్, మెటర్నల్ హెల్త్ కేర్, న్యూట్రిషన్ అన్నారు. గురువారం ఉదయం 11.00 గం లకు సర్వో దయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దామెర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో ఆత్మకూరు, దామెర ఆరోగ్య కార్యకర్తలకు లింగాధరిత హింస నివారణ, మహిళ రక్షణ చట్టాలపై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న లింగ వివక్ష కు గురి అవుతున్నారని, పురుష అధిక్యత గల సమాజంలో మహిళలకు, బాలికలకు లింగ వివక్షత తో కూడిన ఆచార కట్టుబాట్లతో అనేక రకాల హింసకు గురి అవుతున్నారని అన్నారు. ఆశా కార్యకర్తలు గ్రామాలలో గర్భిణీ మహిళాలపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అన్నారు. మొదటి బిడ్డ ఆడ బిడ్డ పుట్టినప్పుడు రెండవ సారి పుట్టబోయేది బిడ్డ ఆడ,మగ అని తెలుసుకోవడానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్నారు. అది చట్ట రీత్యా నేరం అనేది వారికి తెలియజేయాలి అన్నారు. సర్వోదయ సంస్థ కార్యదర్శి డా.పల్లెపాడు దామోదర్ మాట్లాడుతూ.. 20 సంవత్సరాలనుండి హింసకు గురి అవుతున్న మహిళలకు మహిళా సహాయక కేంద్రాల ద్వారా సుమారు 27000 ల కుటుంబాలను విచ్చిన్నం కాకుండా, అత్యవసర సేవలను అందించి బాధిత మహిళలకు అండగా నిలిచిందని అన్నారు. సర్వోదయ సంస్థ హన్మకొండ మరియు వరంగల్ జిల్లలో సఖి వన్, స్టాప్ కేంద్రాలను 24 గంటలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. మహిళా సాధికారతకు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచితంగా వృత్తినైపుణ్య శిక్షణలు టైలరింగ్ మరియు కంప్యూటర్స్ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించిందని అన్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల జీవన ఉపాధి మెరుగు పరచడానికి వడ్డీ లేని రుణాలను అందించి సూక్ష్మ మరియు పరిశ్రమలు ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి కృషి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి హనుమకొండ మాస్ మీడియా అధికారి మాట్లాడుతూ.. మహిళ సంరక్షణ మరియు మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల రక్షణ కోసం అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్వో దయ సంస్థ సేవలు అభినందనియం అని, శిక్షణలో ఆరోగ్య కార్యకర్తలు వారి గ్రామాలలో తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది. రక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. అడ్వకేట్ రవి కార్యక్రమ సమన్వయకర్త మాట్లాడుతూ మహిళా రక్షణ చట్టాలు,ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. చట్టాలు అమలు కు అందరూ కలసి కృషి చేయాలని కోరారు. సఖి కేస్ వర్కర్ భారతి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు మహిళల రక్షణకు సఖి వన్ స్టాప్ సెంటర్, జిల్లా మహిళా సాధికరత మరియు స్వధార్ హోమ్స్ ఏర్పాటు చేసిందని,సమస్యలలో ఉన్న మహిళలు 100, 181, ను సంప్రదించాలని కోరారు. భరోసా సెంటర్ నుండి నవ్య మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యం లో హింసకు గురైన మహిళలకు,బాలికలకు అండగా భరోసా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వోదయ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కవిరాజ్,సభ్యులు ఇందిరా, రవీందర్,శ్రీలత,సఖి కేస్ వర్కర్ భారతి,భరోసా నుండి మౌనిక,నవ్య తదితరులు పాల్గొన్నారు.