బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులకు కొనడం కష్టంగా మారింది. భారతదేశంలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.రూ.87,620 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.79,450 గా ఉంది. వెండి ధర ఐదు రోజుల తరువాత పెరిగింది. ఇవాళ కిలో వెండి రూ. 107,302 వద్ద కొనసాగుతోంది.