షర్మిలతో విజయసాయి రెడ్డి భేటీ
APCC ప్రెసిడెంట్ షర్మిలతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. ఇటీవలే వారిద్దరూ రహస్య మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో ని లోటస్ పాండ్ లో ఉన్న షర్మిల నివాసంలో వారిద్దరూ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు 3 గంటల పాటు భేటీ జరగగా.. రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో విజయసాయి కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.