రాయితీపై ‘డ్రోన్‌’లు.. దరఖాస్తుకు ఆహ్వానం

Bharath Gowd
1 Min Read
  • 4 లక్షల వరకు సబ్సిడీ అందజేత
  • మండల వ్యవసాయ అధికారిణి దీపిక వెల్లడి

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై డ్రోన్ పరికరాలను అందిస్తోందని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిణి దీపిక ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు రైతు ఉత్పత్తి సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సుమారు 4 లక్షల రూపాయల వరకు రాయితీ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పొలాల్లో మందుల పిచికారీ వంటి పనులు సులభతరం అవుతాయని వివరించారు. ఆసక్తి కలిగిన సంఘాలు సంబంధిత పత్రాలతో పాటు నిర్ణీత మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించి 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *