
చేర్యాల జనవరి 29(ప్రజాజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగింది. చేర్యాల మున్సిపల్ పరిధిలోని నామినేషన్ సెంటర్ ను సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెర్మల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని అధికారులను,ప్రజలను,రాజకీయ నాయకులను కోరారు.హుస్నాబాద్ ఏసీపీ సదానందం నేతృత్వంలో చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు
