తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి.. ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహిళా ఐఏఎస్ అధికారులపై, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
